J365 న్యూస్ : బుధవారం నాడు ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ ఖమ్మం నందు తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం యొక్క ఖమ్మం జిల్లా కమిటీని రాష్ట్ర శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాదావత్ శ్రీనును ఎన్నుకున్నారు.ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా కామేపల్లి మండలంకు చెందిన బాదావత్ శ్రీను ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షులు బాదావత్ శ్రీను మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులుగా తమను ఎన్నుకున్నందుకు రాష్ట్ర శాఖ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంఘ బలోపేతానికి కృషి చేస్తానని,గిరిజన ఉద్యోగుల సమస్యల పట్ల అహర్నిశలు శ్రమిస్తానని తెలియజేశారు.స్థానికత కోల్పోయినటువంటి 317 బాదిత ఉద్యోగులకు న్యాయం చేయాలని పిఆర్సి కమిటీ సత్వరమే నివేదిక సమర్పించాలని పెండింగ్ బిల్లులను సకాలంలోనే అందజేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక లక్ష డెబ్భై వేల మంది ఉద్యోగస్తులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో తెగ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు గంగావత్ శ్రీనివాస్ నాయక్, రామచంద్రు నాయక్ , సారంగ పాని మరియు గూగులోత్ నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు.
