Wed. Feb 4th, 2026

భద్రాచలం 18 ఫిబ్రవరి j365 న్యూస్ : ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏ సమావేశాలు నిర్వహించకుండా వాటి ప్రధాన ఉద్దేశాలను నిర్వీర్యం చేసిందని,2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న గత బిఆర్ స్ ప్రభుత్వం ఐటిడిఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని,గిరిజన కుటుంబాలకు మేలు జరిగే విధంగా పాలకమండలి సమావేశంలో సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వాలని,విద్య, వైద్యం, ఆశ్రమం, ఉపాధి కి బాటలు వేసే విధంగా ఐటీడీఏ ప్రణాళికలు ఉండాలని, ఐటీడీఏ పరిధిలో గిరిజన జీవన స్థితిగతులు మెరుగుపడాలి అంటే విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆదిశగా అధికారుల ప్రణాళికలు ఉండాలని,రెసిడెన్షియల్, ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని,పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఉన్నత చదువులు వెళ్లడానికి కావలసిన సహకారం, అవగాహన కల్పించాలని, జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలని, ఇంటర్ నుండి ఉన్నత చదువులకు వెళ్ళని విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు

Share this post...