అశ్వరావుపేట,j365 న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కుడుములపాడు గ్రామానికి చెందిన పూనం ప్రకాష్ కృష్ణవేణి దంపతులకు నలుగురు కుమార్తెలు వీరు కూలి పని చేస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇటీవల వారి రెండవ కుమార్తె అయిన పూణెం మీనాక్షి చలిమంట దగ్గరకు వెళ్లి అగ్ని ప్రమాదానికి గురైంది ఏడు సంవత్సరాల ఈ పసిపాప ఒళ్లంతా కాలిపోవడంతో వెంటనే వరంగల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అక్కడి డాక్టర్లు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని చెప్పడంతో చూయించే స్తోమత లేక వెంటనే వినతిరిగి తమ సొంత గ్రామానికి వచ్చారు రెక్కాడితేగాని డొక్కాడని ఈ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చి పడింది ఈ చిన్నారికి పునర్జన్మ ఇవ్వాలనే సంకల్పంతో కొందరు ఆర్థిక సాయం చేస్తున్నారు అదే క్రమంలో అశ్వరావుపేట ఎంపీటీసీ వేముల భారతి వారిని పరామర్శించి కొంత ఆర్థిక సహాయం చేశారు అంతేకాకుండా దాతలు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే 9573613828 నంబరు ఫోన్ పే చేయవలసిందిగా కుటుంబ సభ్యుల తరఫున కోరుతున్నారు

