J365న్యూస్,కొత్తగూడెం: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు నేటితో 17వ రోజు ఈ సందర్భంగా ఏటీఎఫ్ ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ల రవికుమార్ ప్రధాన కార్యదర్శి కబ్బాకుల రవి దీర్ఘాసిబిరానికి విచ్చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావాన్ని సంపూర్ణ మద్దతును తెలియజేసి ప్రసంగించారు.ప్రభుత్వాలు మారడం సహజమౌతుంది కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల బ్రతుకులు మారడం మాత్రం మారట్లేదని ఈ సందర్భంగా ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ తెలియజేశారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాటనే ఇప్పుడు ఉద్యోగస్తులు అడుగుతున్నారు కానీ మీరు ఇవ్వనటువంటి మాటలు మాత్రం కాదు ముఖ్యమంత్రి గారు దయచేసి విరిపట్ల సానుకూలంగా ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా ఈ టెంట్ కింద నుంచి లేపాలని తద్వారా ఈ ప్రాంతంలో చదువుతున్నటువంటి గిరిజన విద్యార్థులందరూ సక్రమంగా విద్యను అభ్యసించే అవకాశం ఉందని లేకపోతే చదువుకి వెనుకబడిపోయి ఈ ప్రాంతంలో డ్రాప్ ఓట్లు పెరిగే ప్రమాదం ఉందని సూచించారు.
కబ్బాకుల రవి మాట్లాడుతూ వీరందరూ బాగా చదువుకున్న వారిని వీరిని ఇక్కడ కూర్చోబెట్టడం ఏ మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదని భవిష్యత్తులో ప్రభుత్వం దీనికి అంతకంతకు అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీఎస్ టిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు రోడ్డున పడడం అనేది అంత ఆషామాసి విషయం కాదని రోజు వందల మంది విద్యార్థులకు విద్య విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయులు ఇలా రోడ్డుమీద కూర్చుంటే ప్రభుత్వం నిమ్మకు నీరేతనట్టు కూర్చోవడం ఏమాత్రం సమంజసం కాదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున వారి ప్రతినిధులని సచివాలయానికి పిలిచి వెంటనే చర్చలు జరిపి అవి ఫలప్రదం చేసి వీరికి తగిన న్యాయం చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మొండి పట్టుదలకపోతే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మహిళా అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ములకలపల్లి మండలంలో పాల్గొన్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి వారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ చందు మహిళా అధ్యక్షురాలు ఏం తులసి కార్యనిర్వాహక అధ్యక్షులు పి. సిద్దయ్య ముఖ్య సలహాదారు సురేష్, పార్వతి, సరోజా, దేవి సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

