Tue. Mar 24th, 2026

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె హెచ్ జవహర్ బాబు,బి మోతిలాల్

J365 NEWS,కొత్తగూడెం ( ):  తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కార్యవర్గాన్ని టిఎస్పిటిఎ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.హెచ్ జవహర్ బాబు అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా కార్యవర్గం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొంది నియమావళి ప్రకారం పూర్వ అధ్యక్షుడి రాజీనామాతో రద్దయిన కార్యవర్గం స్థానంలో రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా కె హెచ్ జవహర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా బి మోతిలాల్, మహిళా అధ్యక్షురాలుగా కె మంగా, ఉపాధ్యక్షులుగా కె నాగేశ్వరరావు, బి శోభారాణి, కె రామారావు,
మహిళా ప్రధాన కార్యదర్శిగా రజియా బేగం, కార్యదర్శిలుగా ఎ రఘుపతి, ఎస్ రాజమౌళి మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గంతో రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు.

Share this post...