- వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు..
- మల్లికాంబ మనోవికాస కేంద్ర మానసిక దివ్యాంగులతో కలసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ఎంపీ, ఎమ్మెల్యే
- ఎంపీ, ఎమ్మెల్యే లకు చిల్పూర్ ఆలయ వేద పండితుల ఆశీర్వచనం
J365 న్యూస్, హన్మకొండ: కనకదుర్గ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో 2025 నూతన సంవత్సరం సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కి, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి కి ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మానసిక దివ్యాంగ చిన్నారులతో కలసి కేక్ కట్ చేశారు. చిన్నారులకు ఎంపీ ఎమ్మెల్యే స్వయంగా స్వీట్స్ తినిపించి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ.. 2025 ఈ నూతన సంవత్సరంలో, ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని, గ్రామాలలో ప్రశాంత వాతావరణంతో పల్లెలు పైర్లు పచ్చగా కళకళలాడాలని, విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిల్పూర్ ఆలయ వేద పండితులు నూతన సంవత్సరం పురస్కరించుకుని ఎంపీ, ఎమ్మెల్యేలకు వేద ఆశీర్వచనం అందజేశారు.

