చదువుతోనే ఉన్నతస్థాయి కి చేరుకోగలం మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు గుండె విజయరామరావు
J365 న్యూస్,వేలేరు :
చదువుతోనే ఉన్నతస్థాయి కి చేరుకోగమని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు గుండె విజయరామరావు అన్నారు. శుక్రవారం కెనరా రోబోకో ఫౌండేషన్ వారి సహాయంతో వేలేరు మండలంలోని వేలేరు, పీచర, మల్లికుదుర్ల,ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో6,7,8వ తరగతి చదివే విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.సుమారు 400 సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రఘు, మమత,వరంగల్ పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాలా యుగేందర్ రెడ్డి ,ఘనపూర్ స్టేషన్ అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి ,వేలేరు మండల బీజేపీ అధ్యక్షుడు కాట్రేవుల రాజు యాదవ్,చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటే ఉపేందర్ యాదవ్,ఘనపూర్ స్టేషన్ మండల అధ్యక్షులు సట్ల వెంకటరమ,మాజీ జడ్పిటిసీ చాడ సరితా రెడ్డి, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి,మాజీ ఎంపిటిసి వెంకటేశ్వర్లు,బీజేపీ నాయకులు మజ్జిగ లింగం,సురేష్,దామోదర్ రెడ్డి,బీజేపీ సోషల్ మీడియా రమేష్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు