Wed. Mar 25th, 2026

  J365 న్యూస్,  అశ్వారావుపేట :

ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో తన నివాసంలో సున్నం నాగమణి , మోరంపుడ అప్పారావు మాట్లాడుతూ రైతు భరోసా అమలు విషయములో దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని , రైతు భరోసా పథకాన్ని షరతులు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతు రుణమాఫీని అర కొరగా చేశారు. రాష్ట్రంలో సాగయ్యే పంటల వివరాలు, సాగు విస్తరణం, రైతు కూలీల లెక్కలన్ని ప్రభుత్వం వద్ద ఉన్నాయి, కానీ రైతు భరోసా కోసం మళ్లీ దరఖాస్తులు చేయాలని చెప్పడం కాలయాపన కోసమే. గత ఏడాది నవంబర్ 30న పాలమూరులో జరిగిన రైతు పండగ సభలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డిగారు 4 వ విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తున్నట్టు చెక్కును ప్రదర్శించారు. ఆ డబ్బులు ఇంతవరకు రైతు ఖాతాలో పూర్తిగా జమ కాలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చిన అమలులో పూర్తి విఫలమైందని అని ఆరోపిస్తున్నాము.
రైతులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమంలో కొండ్రు సుందర్రావు ,ఉరుబుద్ధి వెంకన్న,పాశం అంజి,తదితరులు పాల్గొన్నారు.

Share this post...