J365 న్యూస్, పాల్వంచ: ఐటిడిఏ భద్రాచలం ప్రాజెక్టు ఆఫీసర్ బి రాహుల్ ఐఏఎస్ ఆదేశానుసారం పాల్వంచ ఆశ్రమ ఉన్నత పాఠశాల నందు కెరీర్ గైడెన్స్ ఏ హెచ్ ఎస్ రేగళ్ల తండా,ఏజీహెచ్ఎస్ పాల్వంచ,ఏ హెచ్ ఎస్ పాల్వంచ,ఎస్టి బిహెచ్ పాల్వంచ పాఠశాలలకు నిర్వహించారు.ఇందులో భాగంగా 495 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.పదవ తరగతిలో 100% ఫలితాల సాధనకు విద్యార్థులు లక్ష్య నిర్ధారణకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పదో తరగతి పాసైన తర్వాత ఏ ఏ కోర్సులు ఉన్నాయి అవి విద్యార్థుల భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాలను ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వక్తలు వివరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.భద్రు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు పి.మణమ్మ మరియు స్పెషల్ ఆఫీసర్,పిఎంఆర్సి ఏసిఎంఓ రమణయ్య మరియు అతిథులుగా పాల్వంచ తాసిల్దార్ జి.వివేక్, మున్సిపల్ కమిషనర్ కె. సుజాత, ఎంఇఓ ఎ.శ్రీరామమూర్తి, ఏఓ బి.శంభో శంకర్, మెడికల్ ఆఫీసర్లు ప్రతాప్, ఏ ఎస్ ఓ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ జె ప్రశాంత్ హాజరయ్యారు.
గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పి మణెమ్మ విద్యార్థులు తమ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకొనుటకు గాను లక్ష్యాలను నిర్ధారించుకొని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని.అందుకుగాను ముందుగా పదవ తరగతి మొదటి మెట్టు అని,అందరూ మార్కులతో 100% ఫలితాలు సాధించాలని,ఒక గొప్ప లక్ష్యంతో గౌరవ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్ ఈ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహించాల్సిందిగా ఆదేశించినందువలన ఈ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకొని మంచి పౌరులుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని తమ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విద్యార్ధుల భవిష్యత్తు మరియు కెరీర్ గైడెన్స్ అంశాలపై అవగాహన కల్పించారు.ఉపాధ్యాయ విద్య గురించి టి. బాలు ఎల్ ఎఫ్ ల్ హెచ్ మరియు డి. ఉమాదేవి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం మరియు ఏ శ్రీరామమూర్తి ఎంఈఓ పాల్వంచ అవగాహన కలిగించారు.విద్యార్థులు క్రమశిక్షణ కలిగి వ్యక్తిగత లక్ష్యాలు నిర్ధారించుకొని ఆ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ కె. సుజాత అన్నారు.విద్యార్థులు ఉన్నత విలువలు కలిగి ఉండి విద్యలో చక్కటి నైపుణ్యాలు పొంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ సర్వీస్ ఉద్యోగాలు సాధించుటకు వివిధ పోటీ పరీక్షలు రాసి తమ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని వివరిస్తూ ఆయా పోటీ పరీక్షల వివిధ దశల గురించి పూర్తిగా వివరించారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును నిర్ధారించుకొని మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.విద్యార్థులు పదో తరగతి తర్వాత ఇంటర్లో బైపీసీ చదివి డాక్టర్ వృత్తిని స్వీకరించి ప్రజలకు సేవ చేయాలని ఇది ఎంతో గౌరవప్రదమైన వృత్తి అని ఎంబిబిఎస్ చదవడానికి ఉండవలసిన అర్హతలు మరియు ఇంటర్మీడియట్ బైపిసి చదివిన వారికి గల వివిధ అవకాశాలను డాక్టర్ టీ ప్రతాప్ మెడికల్ ఆఫీసర్ వివరించారు.విద్యార్థులు ఇంటర్ బైపీసీ చదివిన తర్వాత వ్యవసాయ కోర్సులు ఏమేమి ఉన్నాయి వాటికి ఏఏ పరీక్షలు రాయాలి మొదలగు విషయాలను ఏ ఓ శంభో శంకర్ వివరించారు.
విద్యార్థులు నైతిక విలువలు క్రమశిక్షణ కలిగి ఉండి తగిన లక్ష్యాలను నిర్ధారించుకుని ఆ లక్ష్యాల సాధనకు కష్టపడి చదివి ఆ లక్ష్యాలను సాధించాలని యం వెంకటేశ్వర్లు స్టాటిస్టికల్ ఆఫీసర్ వివరించారు.పదవ తరగతి పాసైన తర్వాత చదవవలసిన వివిధ కోర్సులు ఐటిఐ వ్యవసాయ కోర్సులు మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ మొదలగు కోర్సులను గురించి వివరించి గ్రూపు పరీక్షలకు విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలో జూనియర్ అసిస్టెంట్ తాసిల్దార్ జె ప్రశాంత్ వివరించారు.ఈ కెరీయర్ గైడెన్స్ కార్యక్రమాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలలో అన్ని శాఖల అధికారుల ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నా ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్ కు ప్రత్యేక ధన్యవాదాలు.మరియు ఈ కార్యక్రమానికి హాజరైన అతిధులు వివిధ శాఖల అధికారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. భద్రు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ హెచ్ ఎస్ పాల్వంచ,ఏ జి హెచ్ ఎస్ పాల్వంచ,ఏ హెచ్ ఎస్ రేగళ్ల తండా,ఎస్ టి బి హచ్ పాల్వంచ విద్యార్థినీ విద్యార్థులు మరియు ఈ నాలుగు పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


