J365న్యూస్, కొత్తగూడెం:భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3 తేదీన ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు మేధావులు విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద నాగకృష్ణ కృష్ణ బయ్య అభిమన్యు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్ వెంటనే విడుదల చేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తున్న కనీసం విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం విఫలమైందన్నారు. అద్దె భవనంలో ఉంటున్న గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయలన్నారు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని
మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ పోస్ట్ భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సొంత భవనం ప్రారంభించాలని హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు సుమారుగా 6 నెలల నుంచి మెస్ బిల్లు విడుదల చేయక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల ఇంటిని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రవళి స్వప్న మౌనిక సరిత స్రవంతి జాహ్నవి చిన్న తదితరులు పాల్గొన్నారు. 
