Fri. Jan 30th, 2026

J365 NEWS:  శ్రీకల్ప సోషల్ సర్వీసెస్ జనగాం వారి ఆధ్వర్యంలో మహిళ లకు కుట్టు శిక్షణ, బ్యూటీషన్లు కోర్స్, హోమ్ నీడ్ ప్రోడక్ట్ షాంపూ, ఫినయిల్, సర్ఫ్ కోర్స్ లలో 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు.

మహబూబాబాద్ పరిసర గ్రామాల్లో ఉండే మహిళలు, యువతలు ఎందరో వాళ్ళ సొంత కాళ్లపై నిలబడాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం. ఇంట్లో వాళ్లకి చేదోడు వాదోడు గా ఉండాలి అని ఉండే మహిళలకు మీ సంకల్పం కి మేము తోడుగా ఉంటాం అని చైర్మన్ కల్పలత, స్రవంతి నాయక్ తెలిపారు. అందులో భాగంగా మహబూబాబాద్ వాస్తవ్యులు స్రవంతి మోహన్ నాయక్ దంపతులకు కుమారుడు యాషిత్ శ్రీరామ్ నాయక్ జన్మదిన సందర్బంగా ఈ కార్యక్రమంన్ని ప్రారంభించం అని శ్రీకల్ప సోషల్ సర్వీస్ చైర్మన్ కల్పలత అన్నారు.

ఆసక్తి గల మహిళలు నెహ్రు సెంటర్ దగ్గర కామాక్షి లేడీస్ టైలర్స్ దగ్గరికి వెళ్ళి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అని తెలిపారు. వివరాలకు స్రవంతి నాయక్ 90634 84855 నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు కనుక్కోగలరని అన్నారు.

Share this post...