Tue. Feb 3rd, 2026

 J365న్యూస్, మచిలీపట్నం:  18 ఏళ్ళు లోపు బాలికల పట్ల ఏ విధమైన వేధింపులు కి గురిచేసిన పోక్సా చట్టం క్రిందకఠినజైలుశిక్షలు జరిమానాలు విధించడం జరుగుతుందిఅని లంకిశెట్టి బాలాజీ తెలిపారు..మచిలీపట్నం లో జిల్లాజడ్జి స్థాయి కలిగిన కోర్టు,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో కేసులు విచారణ జరుగుతుందని తెలిపారు.

చదువుతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమని అందుకు దోహదపడే విద్యకు నిరంతర ప్రోత్సాహం అవసరమని న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు. మచిలీపట్నం లేడీ యాంప్తిల్ హైస్కూల్లో శనివారం ఉదయం నలుగురు విద్యార్థులకు సాయన వీర భద్రయ్య-వీరరాఘవమ్మ సేవా సమితి ద్వారా 15,000 రూపాయీలు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయన సుశీలరావు,సచాయ్ హోటల్ యజమాని బండి సత్యనారాయణ ఈ సాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. విద్య ద్వారా సమాజ ఎదుగుదలకు అవసరమైన ఎన్నో కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు జీవితానికి అవసరమైన పాఠాలను నేర్చుకోవాలన్నారు. తద్వారా జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్య సాహసాలు అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ విద్యను ప్రోత్సహించాలనే తలంపుతో పేద విద్యార్థులకు నగదు సాయం చేస్తున్న రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయన సుశీల్ రావు ఎంతో అభినందనీయులన్నారు. తల్లిదండ్రుల పేరు మీద సేవా సమితి ఏర్పాటు చేసి గత కొన్నేళ్లు గా విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించడం హర్షణీయమన్నారు .రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయన సుశీలరావు మాట్లాడుతూ విద్యార్థుల చదువు సమాజాభివృద్ధికి దోహదం కావాలన్నారు. కృషి పట్టుదలతో విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలేసుకోవాలన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే విద్యార్థులు తమ చదువుకు దూరం కాకూడదనే కాంక్షతో తాను ఈ ప్రోత్సాహ బహుమతులు అందిస్తున్నామన్నారు .

 ఇందుకు అమెరికాలో ఉన్న తన కుమార్తె సాయన సంధ్య ఎంతగానో సహకరిస్తుందని చెప్పారు .సచాయ్ హోటల్ యజమాని బండి సత్యనారాయణ మాట్లాడుతూ చదువుకు పేదరికం ఆటంకం కాకూడదన్నారు . కష్టనష్టాలను అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు విద్యార్థులు నిరంతరం శ్రమించాలన్నారు . చదువుకు ప్రోత్సాహం అందించడమే నిజమైన సేవగా ఆయన అభిలాషించారు.లేడీ యాంప్తిల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. మెటిల్డా

 రాణి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు హర్షియా తాతూన్(9 వ తరగతి )నాగదుర్గ (10వ తరగతి)దేవి (9వ తరగతి)తో పాటు మరో విద్యార్థి జ్ఞానేశ్వర్ (5 వ తరగతి,కేరళా పబ్లిక్ స్కూల్ )కు నగదు బహుమతులు అందించడం పట్ల అభినందనలు తెలిపారు .అడిషనల్ ఎస్పీ సాయన సుశీలరావు తన తల్లిదండ్రులు పేరు మీద ఏర్పాటు చేసిన సేవా సమితి ద్వారా ఈ తరహా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కె వి కృష్ణారావు , లేడియాంప్తిల్ పాఠశాల తెలుగు టీచర్ ఎం. హైమావతి తదితర టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share this post...