Sat. Dec 21st, 2024

కొత్తగూడెం: దేశ భవిష్యత్తు పిల్లలే అని, నేటి బాలలే రేపటి పౌరులని వారి ఉన్నతికి తల్లిదండ్రులు, గురువులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం ఐడిఓసి సమావేశపు హాలులో
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు అమ్మ ఒడే ప్రధమ బడి అని, తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుండే క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించాలని అన్నారు. నేటి తరం బాగా చదువుకుంటే ఉన్నత ఉద్యోగం సాధించి భవిష్యత్తులో తల ఎత్తుకొని తిరిగే ఉద్యోగం సాధిస్తారని చెప్పారు. చదువుతో సమానత్వం సాధించవచ్చని, ఉన్నత చదువులు చదివి దేశానికి సేవ చేయాలని చెప్పారు. చిన్నారులు ఆటల్లో రాణించాలని, బలమైన ఆహారం తీసుకోవాలని, తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని హితువు పలికారు. నవంబర్ 14 పండిట్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, చాచా నెహ్రూ గారికి చిన్నపిల్లలు అంటే వల్లమాలిన అభిమానమని, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా నెహ్రూ చిన్నపిల్లలను చూస్తే చాలా సంతోషించే వారిని, వారితో సంభాషించే వారిని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యత నిర్వహించాలని నేటి పిల్లలే రేపటి సమ సమాజ నిర్మాతలని, వారిని అన్ని విధాలా ప్రోత్సహించి మంచి బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ రాజు, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, డిపిఆర్వో శ్రీనివాస్, ఇంటర్మీడియట్ విద్యా అధికారి సులోచన రాణి, డీఈఓ వెంకటాచారి, బాలల హక్కుల సంగం చైర్మన్ పేరు పెట్టాలి, తదితరులు పాల్గొన్నారు.

Share this post...