Sat. Dec 21st, 2024

కొత్తగూడెం నవంబర్ 15(J365news): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి  కార్యాలయంలో  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె వి ఎల్ శిరీష  ఆధ్వర్యంలో  పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశమును నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అడ్వైజరీ కమిటీ నందు ఆరు కొత్తగా నియమించిన స్కానింగ్ సెంటర్లు మరియు నాలుగు రినివల్స్ కు అనుమతి ఇవ్వడంపై తీర్మానం చేయడం జరిగినది.  అదేవిధంగా జిల్లా వైద్యాధికారి గారు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైతే అబార్షన్ రేటు మరియు ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న ఏరియాలలో నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయవలెనని, మరియు ఆయా ప్రాంతాలలో అవగాహన కార్యక్రమంలో నిర్వహించాలని మాట్లాడడం జరిగినది. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచి వారికి చట్టపరమైన శిక్షలు వేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ ముక్కంటేశ్వర , డాక్టర్ చైతన్య , డాక్టర్ కోరా శ్రీ , డాక్టర్ అనూష , డాక్టర్ నరేందర్ ,డి పి ఆర్ ఓ శ్రీనివాస రావు ,డిప్యూటీ డెమో ఎండి ఫయాజ్ మోయుద్దిన్ ,నాగలక్ష్మి  ,బేబీ  పాల్గొన్నారు

Share this post...