మణుగూరు 14 నవంబర్ 23(j365news): పినపాక నియోజవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు మంగళవారం మణుగూరులో జనరల్ అబ్జర్వర్ ఎస్ హరి కిషోర్ పినపాక నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ తో కలిసి పోలింగ్ బూతులను పరిశీలించారు. సింగరేణి ఉన్నత పాఠశాల పివి కాలనీలో ఉన్న పోలింగ్ బూతును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఎడ్యుకేషన్ లో స్ట్రాంగ్ రూములను మరియు క్రియేషన్ క్లబ్ ప్రకాశవన కాలనీలో ఉన్న పోలింగ్ బూతులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ పినపాక నియోజకవర్గం ఏ ఆర్ ఓ రాఘవరెడ్డి, నాగరాజు మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు , మణుగూరు రూరల్ ఆర్.ఐ వై శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.