Wed. Mar 25th, 2026

J365 న్యూస్:

లక్ష్మీ దేవీ పల్లి మండలం శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవనజ మరియు డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ పరంధామయ్య రెడ్డి ఆధ్వర్యంలో రైఫిల్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుకలు మరియు మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిమ్న జాతుల మహిళా కోసం వారి విద్యాభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు గణనీయమని కొనియాడారు. విద్యార్థులు ప్రావీణ్యం గడించి దేశం గర్వించదగ్గ పౌరులుగా తయారు కావాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్ తర్వాత రైఫిల్ షూటింగ్ నేర్పే రెండవ ప్రదేశము కొత్తగూడెం శ్రీరామచంద్ర కళాశాల కావడం సంతోషదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వనజ,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూర్ణచంద్రరావు, స్పోర్ట్స్ ఇన్చార్జి వెంకన్న,ఏవో జ్యోతి కళాశాల సిబ్బంది,అధికారులు రైఫిల్ షూటింగ్ కోచ్ అబ్దుల్ నబీ మొహమ్మద్, హాకీ కోచ్ ఇమామ్ పాల్గొన్నారు

Share this post...