Wed. Mar 25th, 2026

J365 న్యూస్,  మహబూబాబాద్:  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైన రైతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంభిస్తూ యుద్దప్రాతిపదికన వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లను మంజూరు చేస్తున్నామని మహబూబాబాద్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ జె.నరేష్ తెలిపారు.ఈ ఏడాది ( 1-1-2024 నుండి 31-12-2024) వరకు 3256 సర్వీసులను మంజూరు చేశామని తెలిపారు. ఒక డిసెంబర్ నెలలోనే దాదాపు 611 సర్వీసుల మంజూరు చేశామని తెలిపారు.2023 సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 44%శాతం పెరిగిందని అన్నారు. వ్యవసాయ సర్వీసుల మంజూరుకు తీసుకోవాల్సిన అన్ని సత్వర చర్యలు తీసుకుంటూ త్వరితగతిన రిలీజ్ చేస్తున్నామని వివరించారు.

రైతుల పట్ల నిబ్బద్దత వారి శ్రేయస్సు కోరుకుంటూ వారికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అధిక ప్రాధాన్యత ఇస్తూ మంజూరు విషయంలో పెద్దపీటవేస్తున్నామని ఈసందర్బంగా తెలిపారు.వ్యవసాయ సర్వీసుల మంజూరు ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు దరఖాస్తు ఎక్కడ పెండింగ్ ఉన్నది, ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నది దానికి గల కారణాలను సవివరంగా అగ్రికల్చర్ పోర్టల్ ( ఆన్ లైన్ )లో చూసుకునే వెసులు బాటు ఉందన్నారు.దీని ద్వారా మంజూరులో ఆలస్యం లేకుండా వేగంగా మంజూరు అవుతున్నాయని అన్నారు.

అలాగే E-Stores విధానం ప్రవేశపెట్టడం ద్వారా కావాల్సిన మెటీరియల్ ను ఆన్ లైన్ ద్వారా రిజర్వ్ చేసుకొని మెటీరియల్ ను కావాల్సిన సమయంలో తీసుకొని పనులు ప్రారంభించడం వలన వెంటనే మంజూరుకు ఎంతగానో దోహద పడుతుందని తెలిపారు . పేపర్ పని లేకుండా ఆన్ లైన్ ద్వారా మెటీరియల్ తీసుకునే సౌలభ్యం విద్యుత్ శాఖకు , రైతులకు ఎంతో మేలు చేకురుతుందని చెప్పారు. అలాగే ఒక పనికి సంబంధించిన మెటీరియల్ ఏమైనా మిగిలి ఉంటె వేరే పనికి పేపర్ ట్రాన్సా క్షన్ ద్వారా మార్చుకొనే వెసులుబాటు మొత్తం కూడా ఆన్ లైన్ లోనే చేశామని తెలిపారు.ఈ పద్ధతి వలన క్షేత్ర స్థాయిలో పనిచేసే విద్యుత్ అధికారులకు ఎంతగానో సమయం ఆదా అవుతుందని వివరించారు.విద్యుత్ అధికారులు రైతులకు మరింత చేరువై వారి సమస్యలను పరిష్కరించే దిశగా “పొలంబాట” కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.రైతులకు వ్యవసాయ సర్వీసుల మంజూరుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని వెనువెంటనే మంజూరు చేసేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు

Share this post...