Wed. Mar 25th, 2026

పట్టుదలతో కష్టపడితే ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చునని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్ అన్నారు. సోమవారం దుమ్ముగూడెం మండల పరిధిలోని రామచంద్రుని పేట గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవగాహన కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ… పదవ తరగతి విద్యార్థినిలే కాక ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో, ఇప్పటి నుండే కెరిర్ గైడెన్స్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇది ఎంతగానో విద్యార్థులకు ఉపయోగపడతాయని అన్నారు. ఉపాధ్యాయులందరూ బాలబాలికల్లో అంతర్గతంగా దాగి ఉన్న టాలెంట్ను గుర్తించి, వారిలో విద్యా ప్రమాణాలు మరింత పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా తర్ఫీదు ఇవ్వాలని, పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, తదుపరి కోర్సులపై వారికి పూర్తిగా అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థినిలు తప్పనిసరిగా పదవ తరగతి కాగానే ఒక గోల్ ఏర్పాటు చేసుకొని సామర్ధ్యాలను పెంచుకోవాలని, ప్రతిరోజు పాఠశాలల్లో పెట్టిన చార్టులు గమనించి వాటిలోని సారాంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటి సాధనకు ఇప్పటినుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. చాలా మంది విద్యార్థులు భవిష్యత్తులో ఏమి కాదల్చుకున్నారో చాలా విపులంగా చెప్పారని, చాలా సంతోషం మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకముతో మీ భవిష్యత్తు బాగుపడాలని కాయకష్టం చేసుకుంటూ మిమ్మల్ని చదివిస్తున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కోరిక నెరవేర్చాలని తెలిపారు. నేను చదువుకునే రోజుల్లో నా యొక్క గోలు పైలెట్ కావాలని అనుకునేవాడినని, కానీ ఎనిమిదో తరగతి వరకు చదివే రోజులలో ఐఏఎస్ ఆఫీసర్ మా పాఠశాలకు రావడం వలన ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని అనుకున్నానని, కానీ అనుకోని సమయంలో విద్యుత్ శాఖలో ఏఈగా విధులు నిర్వహించానని, నా యొక్క స్నేహితుని సలహా వలన ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను ఐఏఎస్ ప్రిలిమినరీ పరీక్షలు రాసి ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యానని, కావున విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి అనుకున్నది సాధించే వరకు పట్టుదలగా చదివి మంచి ఉద్యోగాలు సాధించుకొని జీవితంలో స్థిరపడాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏవో, స్పెషల్ ఆఫీసర్ సున్నం రాంబాబు, ఏసిఎంఓ రమణయ్య, ఏటీడీఓ అశోక్ కుమార్, ఎంఈఓ సమ్మయ్య, తాసిల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో రామకృష్ణ, హెచ్ఎంలు నరసింహారావు, బట్టు రాములు, సోమశేఖర్, నరేందర్, సర్వేశ్వర దొర, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Share this post...