Wed. Mar 25th, 2026

కొత్తగూడెం సీనియర్ జర్నలిస్టు కండే కుమార్ తండ్రి కండె నరసయ్య (70) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నరసయ్య మంగళవారం ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిసిఎం నేతలు మున్సిపల్ పరిధిలోని ఏ- పవర్ హౌస్ బస్తీ లో గల వారి ఇంటికి వెళ్లారు. నరసయ్య భౌతికకాయానికి సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,సీపీఎం ప్రతినిధి బృందం పూలమాల వేసి నివాళులు అర్పించారు.సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జె. రమేష్,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నందిపాటి రమేష్,సీఐటీయూ నాయకులు కత్తి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share this post...