
మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భగా నేడు ముందస్తుగా గిరిజన సంక్షేమ శాఖ ఆదర్శ క్రీడాల ఉన్నత పాఠశాల కిన్నెరసాని నందు పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయిని సిబ్బందిని ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యార్థులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యల్.రామారావు మాట్లాడుతూ.. మహిళలను విధిగా గౌరవించాలని, మహిళలు లేనిదే సృష్టి లేదని, యత్ర నర్యంతూ పూజ్యతే తత్రా దేవతా అని పేర్కొన్నారు. మహిళలు ప్రస్తుతం అనేక రంగాలలో రాణిస్తున్నారని అన్నారు.స్త్రీ లేనిదే సృష్టి లేదని ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పోలీబోయిన వేంకటేశ్వర్లు అన్నారు.ఈ కార్యక్రమానికి డి.సతీష్ వక్తగా వ్యవరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.
