Wed. Mar 25th, 2026

టేకులపల్లి మండలం సంపత్ నగర్ లో వెంచేసి ఉన్న గిరిజన బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సం కొండపల్లి గోపాలరావు కిషన్ రజిత దంపతులు అధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హాథిరామ్ నాయక్ విశిష్ట అతిథిగా మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగతాయారు డి ఆర్ డి ఓ పీడీ శ్రీనివాసులు హాజరయ్యారు.అంగరంగ వైభవంగా జరిగిన గిరిజన బాలాజీ స్వామివారి కళ్యాణంను ప్రజలు భక్తి శ్రద్ధలతో తిలకించారు.శ్రీ రంగం అజయ్ సాయి చక్రి శ్రీ రంగం విజయ్ సాయి చక్రి పూజరులు కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండలం మరియు ఆళ్లపల్లి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం కళ్యాణం తిలకించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న దాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నాయకులు ఇస్లావత్ బాలు నాయక్, బానోత్ మోహన్, సొమ్ల నాయక్ బీజేపీ జిల్లా నాయకులు బాలాజీ నాయక్ మండల అధ్యక్షులు శంభు నాయక్ నగేష్ బాలు మహిళలూ యువతి యువకులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this post...