
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎఫ్ యల్ యన్ శాంపుల్ సర్వే ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్ సూచించారు.సర్వే నిర్వహణ తీరు పరిశీలనలో భాగంగా ములకలపల్లి మండలంలోని ములకలపల్లి ప్రాథమిక పాఠశాల,మరియు చౌటుగూడెం కాలనీ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి సర్వే నిర్వహిస్తున్న తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. రెండవ తరగతి విద్యార్థులలో సామర్థ్యాలను అంచనా వేయటానికి ఈ సర్వే ఎంతో ఉపకరిస్తుందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సర్వేకు పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు. జిల్లాలోని ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో నేటి నుండి మూడు రోజులపాటు రోజుకు ఒక విషయం చొప్పున విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించమన్నారని ఇందుకోసం 50 మంది క్షేత్ర పరిశీలకులను నియమించి వారికి జిల్లా స్థాయిలో ఆరు ఏడు తేదీలలో రెండు రోజులు పాటు శిక్షణ అందించామని తెలిపారు.
