Tue. Mar 24th, 2026

2025-26 విద్యా సంవత్సరంనకు గాను పూర్వ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించబడుతున్న  మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ కిన్నెరసాని( బాలురు),కాచనపల్లి (బాలికలు) మరియు వాటర్ స్పోర్ట్స్ అకాడమీ బోయినపల్లి,హైదరాబాదు నందు 5 తరగతి ఇంగ్లీష్ మీడియం నందు ప్రవేశాలకు భద్రాద్రి కొత్తగూడెం మరియు జిల్లాలకు చెందిన విద్యార్థినీ,విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ప్రవేశములకు ఎంపిక డివిజన్ స్థాయి నందు ఈనెల 16 మార్చి 25 నుండి 18 మార్చి 25 వరకు, జిల్లాస్థాయిలో 26 మార్చ్ 25 నుండి 28 మార్చ్ 25 వరకు జరుగునని అన్నారు.కావున 5వ తరగతి నందు ప్రవేశం కొరకు 31- 8- 2025 నాటికి 9 నుండి 11 సంవత్సరంల వయసు కలిగిన ఆసక్తి గల గిరిజన విద్యార్థిని,విద్యార్థులు అన్ని ధ్రువీకరణ పత్రములతో 11 మార్చి 2025 నుండి 17 మార్చి 2025 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన విద్యార్థులు “మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని” నందు మరియు ఖమ్మం జిల్లా వారు ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉసిరికాయలపల్లి నందు సమర్పించి ఎంపిక కొరకు డివిజనల్ స్థాయి నందు ఈనెల 16 నుండి 18 వరకు జరుగు ఎంపికలలో హాజరుకావాలని ఆయన అన్నారు.జిల్లా స్థాయి ఎంపికలలో బ్యాటరీ టెస్ట్ (9 అంశముల) నందు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు 26 మార్చి 2025 నుండి 28 మార్చ్ 2025 వరకు తుది ఎంపికలు నిర్వహించి,ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు 5వ తరగతిలో ప్రవేశం కల్పించడం జరుగుతుందని అన్నారు.ఈ ఎంపికల కొరకు తదుపరి సమాచారం కొరకు ఖమ్మం జిల్లా వారు ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉసిరికాయలపల్లి ఖమ్మం జిల్లా, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ప్రధానోపాధ్యాయులన సంప్రదించాలని ఆయన అన్నారు. కావున సంబంధిత వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు,ఇట్టి విషయాన్ని గమనించి, ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులను జిల్లా స్థాయి ఎంపికులకు హాజరు అగునట్లు చూడాలని ఆయన అన్నారు.

Share this post...