చుంచుపల్లి మండలం విద్యానగర్ కు చెందిన కుమారస్వామి అను అతను నగదు రూపంలో పైసలను ATM నుండి విత్ డ్రా చేసుకొని… ఆ నగదు తన వెనుక జేబులో వేసుకున్నానులే అనే ధ్యాసలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.వెనుక జేబులో వేసే క్రమంలో అవి జారీ పడి ఏటీఎం ఉన్న రూమ్ లోనే ఉన్నాయి.ఈ క్రమంలో కోర్టు కానిస్టేబుల్ అహ్మద్ పాషా ఏటీఎంలో గమనించి ఆ నగదు ఎవరిదో అని ఎంక్వయిరీ చేసి ట్రాఫిక్ ఎస్ఐ మదర్ ఆధ్వర్యంలో సదరు వ్యక్తికి అందజేశారు.దీనితో నగదు పోగొట్టుకున్న కుమారస్వామి పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ మానవత్వం ఇంకా మిగిలే ఉందని అన్నారు.
