Thu. Jan 29th, 2026

జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు బలైన 28 మంది అమరులైన వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అశ్రునివాళి అర్పించి నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలని,దేశ ఐక్యత వర్ధిల్లాలని, అవసరమైతే దేశం కోసం మేము సైతం యుద్ధానికి సిద్ధమంటూ..టెర్రరిజాన్ని అంతం చేయాలని నినదిస్తూ.. ఆవాజ్ కో హం ఏక్ హై .. హిందూ,ముస్లిం, క్రిస్టియన్, భాయ్ భాయ్, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ 3 టౌన్ సెంటర్లో మానవహారం చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా,పట్టణ మండల నాయకులు పాల్గొనగా ముస్లిం మైనార్టీ జేఏసీ నాయకులు, సిపిఐ ఇతర ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాల పెద్దలు, యువజన మహిళా కార్మిక సంఘాల నాయకులు పాల్గొని శిబిరాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించి మద్దతును తెలియజేశారు.

Share this post...