Sat. Jan 31st, 2026

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఉద్యమ తరగతులు పాల్వంచ లోని పెద్దమ్మ గుడి శ్రీరామ ఫంక్షన్ హాల్ లో జరిగింది.ఈ ఉద్యమ తరగతులలో ముఖ్య వక్తగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి ముఖ్య ఉపన్యాసకులుగా పాల్గొని వివిధ మండలాల నుంచి హాజరైన టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్లు,జిల్లా కమిటీ సభ్యులు,మండల అధ్యక్ష కార్యదర్శులు,టీఎస్ యుటిఎఫ్ సభ్యులు మరియు ముఖ్య కార్యకర్తలు గా పాల్గొన్న వారి ఉద్దేశించి మాట్లాడారు.శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్ గా జిల్లా అధ్యక్షులు మురళీమోహన్ వ్యవహరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యమం సాధించిన విజయాలు అనే అంశంపై మాట్లాడి ఉపాధ్యాయ ఉద్యమం స్వాతంత్ర పూర్వం నుండి నేటి వరకు జరిగిన ఉపాధ్యాయ ఉద్యమ తీరు తెన్నులను వివరించారు.ప్రస్తుత విద్యా విధానంలో గల అనే విషయాలను గురించి వివరిస్తూ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు గ్రామస్తుల సహకారంతో కృషి చేయాలని కోరారు.ప్రభుత్వ బడిలో గల సౌకర్యాలను అందరికి అర్థం అయ్యే రీతిలో తెలుపాలని, ప్రభుత్వం కూడా కొత్త పాఠశాలల జోలికి వెళ్లకుండా ఉన్న పాఠశాలను బాగు చేయాలని కోరారు. తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా ప్రస్తుత పాఠశాలలను తీర్చిదిద్దాలని దానికి అనుగుణమైన సంస్కరణలు తీసుకురావాలని కోరారు.ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరం చేయాలని కోరారు.విద్య అందరికీ అందే విధంగా నూతన విద్యా విధానంలో తగిన మార్పులు చేయాలని కోరారు. ప్రస్తుత పాఠశాల దానికి అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని కోరారు.ఈ శిక్షణ తరగతులలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు,జిల్లా ఉపాధ్యక్షులు వి.వరలక్ష్మి ఎం. రాజయ్య కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి హాథిరామ్, బి.రాంబాబు, ఎస్ కే యాకూబ్ పాషా,ఆర్ రమేష్ కుమార్, కే గంగాధర్,ఆర్ ప్రసాద్,డి దాసు,రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ కృష్ణ బి కిషోర్ సింగ్, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా నాయకులు ఎ.పద్మలత,బి ప్రకాష్ రావు,గోపి,వర ప్రసాద్,రాందాస్,సురేష్,లక్ష్మ,సీతారామయ్య,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Share this post...