జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లె గ్రామంలో శనివారం సాయంత్రం రాముని అక్షింతల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గాజులు మల్లేశం మాట్లాడుతూ.. అక్షింతలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. భక్తులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాముని కృపకు పాత్రులు కావాలన్నారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, యువకులు, పాల్గొన్నారు.