Fri. Jun 19th, 2026

భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 వ తేది ఉదయం 8 గంటలకు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్స్ కిన్నెరసాని నందు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్ తెలిపారు.ఈ ఎంపికల 8సం. నుండి 20 సం. లొపు బాలబాలికలకు మరియు పురుషుల,స్త్రీలకు 60, 100, 400 మీటర్ల పరుగుపందెం, స్టాండింగ్ బ్రాడ్ జంపు,లాంగ్ జంపు,జవెలిన్,ట్రైయాతలాన్ అంశాలలో పోటిలు ఉంటాయని అన్నారు.ఈ పోటిలలో విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు ప్రధానం చేస్తామని మరియు ప్రతిభ చూపినవారిని ఆగష్టు 3 వ తేదీ హన్మకొండ లో జరుగు రాష్ట్ర జానియర్ మరియు సినియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కు మరియు ఆగష్టు 7 వ తేదీ జనగామ లో జరగబోవు రాష్ట్ర సబ్ జానియర్ ఛాంపియన్షిప్ పోటీలకు పంపుతామని తెలిపారు.జిల్లాలోని అథ్లెట్లు ఈ నెల 24 న ఉదయం 8 గంటల కు కిన్నెరసాని లో అథ్లెటిక్ కోచ్ పి.నాగేందర్ కు రిపోర్టు చేయలని.. వివరాలకు 8328616737 సంప్రదించగలరని ఒక ప్రకటనలో తెలిపారు

Share this post...