మణుగూరు పగిడేరు గ్రామంలో థెరఫీ కేంద్రాలు ఏర్పాటు చేసి,పర్యా టకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ నిర్ణయం. మణుగూరు మండలం పగిడేరులో 30 ఏళ్ల నుంచి 6 ప్రాంతాల్లో భూమి లోపలి నుంచి వేడి నీరు ఉబికి వస్తుంది.మాంటిల్ అనే పొరతో నీళ్లు వేడుక్కుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోనే చాలా అరుదైన ప్రాంతాల్లో ఇలా జరుగుతుందట.ఈ నీటితో స్నానం చేస్తే కాళ్లు, చేతుల నొప్పులు కూడా తగ్గుతాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఇక్కడ ఈత కొలను మాదిరి 6 థెరఫీ కేంద్రాలు ఏర్పాటు చేసి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ నిర్ణయించారు.
