
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన విద్యార్థుల వెలుగు కోసం నిబద్ధతగా పనిచేస్తున్న ఎన్.భిక్షం దంతలబోర (హరిజన వాడా) పాల్వంచ మండలంలోని మారుమూల ప్రాంతం కోయగట్టు గ్రామంలోని గిరిజన ఆదివాసీ విద్యార్థులకు పాఠశాల లేక విద్యార్థులు విద్యకు దూరంగా ఉంటున్నారని తెలుసుకొని ఇంతటి ఆధునికరణ ప్రపంచంలో అన్ని రకాల సాంకేతికతలు అభివృద్ధి చెందిన యుగంలో ఈ గ్రామంలో పాఠశాల లేకపోవడానికి గమనించిన ఈ ఉపాధ్యాయుడు వెంటనే స్పందించారు.విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి,ఆ ప్రాంతంలో నూతన పాఠశాల స్థాపన కోసం నిరంతర ప్రయత్నాలు చేశారు.ఈ గ్రామాన్ని ప్రత్యక్షంగా పలుమార్లు సందర్శించి, గ్రామస్థులతో మరియు విద్యార్థులతో మాట్లాడి, అక్కడ పరిస్థితులు వనరుల్ని అన్ని నిశితంగా పరిశీలించి పాఠశాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు ఆ ఊరికి పాఠశాలను తేవడంలో ప్రముఖ పాత్ర వహించారు అదే ఫలితంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఇఓ వెంకటేశ్వర చారి మరియు పాల్వంచ మండల ఎంఇఓ శ్రీరాం మూర్తి గార్లు లాంఛనంగా ఈ ఆదివాసి గిరిజన ఆవాస ప్రాంతంలో రిబ్బన్ కట్ చేసి కొత్త పాఠశాలను ప్రారంభించారు.ఎంతో మంది పేద గిరిజన విద్యార్థులకు విద్యను అందించడానికి పాఠశాల అవసరాన్ని గుర్తించి అధికారుల దృష్టికి,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన భిక్షం గారినే అక్కడ నియమించి పాఠశాలను ప్రారంభించడం కోస మెరుపు.ఈ కార్యక్రమంలో ఎ ఎం ఓ నాగరాజు శేఖర్,ప్లానింగ్ కోఆర్డినేటర్ సైదులు,ఎంపీ యుపిఎస్ దంతాల బోర ప్రధానోపాధ్యాయులు రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.భిక్షం దృఢ సంకల్పం,అంకిత భావం సేవా మనోభావం అభినందనీయం గిరిజన విద్యార్థుల భవితవ్యానికి మార్గం వేసే ఈ ఉపాధ్యాయుడు కృషి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదనీ…సహచరుడు గిరిజన సంక్షేమాన్ని కోరుకునేటువంటి ఒకరు అయినా బిక్షం కు టి.ఎస్ టిటిఎఫ్ భద్రాది జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.
