ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి (యుయస్పిసి) మూడు దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 5న కొత్తగూడెంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని శుక్రవారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారం ప్రధానోపాధ్యాయులు డి.జగన్ చే జరిగిన యూఎస్పిసి మూడు దశల పోరాట కార్యక్రమాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ ఉపాధ్యాయులను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండు సంవత్సరాలు కావస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిఆర్సి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, పిఆర్సి నివేదికను వెలువరించి వెంటనే జూలై 2023 నుండి పిఆర్సి ప్రకటించాలని, ఉపాధ్యాయుల పదోన్నతుల తోపాటు బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని,అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులు ప్రకటించాలని,గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూలును ప్రకటించాలని,గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలలో పండిట్,పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలలో రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయాలని,డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలని,జీవో నెంబర్ 25ను సవరించి,ప్రతి ప్రైమరీ స్కూల్లో ఇద్దరు టీచర్లు,40 మంది పిల్లలు దాటితే ఐదు గురు టీచర్లు ఉండేలాగా పాఠశాలలను బలోపేతం చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డిఏ లలో కనీసం రెండు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సిపిఎస్ రద్దు పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని,రెసిడెన్షియల్ పాఠశాలల టైం టేబుల్ మార్చాలని,కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనం ఇవ్వాలని, బేసిక్ పే ప్రకటించాలని,గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సిఆర్టి లకు బేసిక్ పే ఇచ్చి రెగ్యులర్ చేయాలని,మోడల్ స్కూల్ టీచర్లకు 010 హెడ్ కింద జీతాలు ఇవ్వాలని,కుల గణన సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఆగస్టు 5న కొత్తగూడెం బస్టాండ్ ఎదురుగా గల చిల్డ్రన్స్ పార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయని,ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ వెంకటేశ్వర్లు,టిపిటిఎఫ్ టేకులపల్లి మండల ప్రధాన కార్యదర్శి పి.సమ్మయ్య, ఉపాధ్యాయులు బి.వాల్యా, ఎ.కిషన్, కె.ఎర్రయ్య,ఎం.శ్రీనివాసరావు,డి.వీరన్న, బి.వీరన్న,టి.రామారావు,కె.భిక్షమయ్య,ఎం.రాంబాబు, జానయ్య పాల్గొన్నారు.
