
భద్రాద్రి కొత్తగూడెం రామవరం ప్రాంతంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి 43వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికులు, గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్ కొట్టూరు నుర్వి రాజశేఖర్ (మొక్కల రాజశేఖర్) మరియు కొత్తగూడెం సెయింట్ మేరీస్ పాఠశాల 6వ తరగతి విద్యార్థిని,ప్రకృతి హరిత దీక్షపరురాలు నైనిక రజువా,మహమ్మద్ ఆఫాన్ జైది లు కలిసి మామిడి మొక్కను నాటి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ “పూల బొకేలు వద్దు… పచ్చని మొక్కలే ముద్దు” అనే స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని ప్రారంభించిన మొక్కల రాజశేఖర్ సేవలను అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు. అలాగే మొక్కల రాజశేఖర్ వద్ద ప్రకృతి హరిత దీక్ష తీసుకున్న నైనిక రజువా, మహమ్మద్ ఆఫాన్ జైదిల ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో యువకులు,స్థానికులు పాల్గొన్నారు.
