Fri. Jan 30th, 2026

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ నందు జెడ్పీ హెచ్ ఎస్ గౌతమ్ పూర్ 2001-2002 పదవతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు. తమ జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు.ఒక్కొకరు ఒక్కొక్క హోదా లో పోలీస్, టీచర్,బ్యాంక్ మేనేజర్, డాక్టర్,సింగరేణి జీ.యం,ఫోటో గ్రాఫర్,రియల్ ఎస్టేట్,ప్రవేట్ జాబ్స్,ఆర్.టి.సి, రాజకీయాలలో,లిరిక్ రైటర్ గా ఎవరికి నచ్చిన వృత్తిలో వారు స్థిరపడ్డారు.ఇరువై మూడు సంవత్సరాల తర్వాత స్నేహితుల దినోత్సవం రోజు అందరూ కలవడం వారి వారి జ్ఞాపకాలను పంచుకుని భావోద్వేగానికి గురి అయ్యారు. సంతోషం వ్యక్తపరిచారు,స్నేహం అంటే కేవలం కలిసిన వెంటనే నా క్లాస్ మెంట్ అని మాత్రమే కాకుండా ఎవరూ కూడా కష్టాల్లో ఉంటే వారి కష్టాల్లో కూడా స్నేహితులు అందరూ కూడా చేదోడు వాదోడు గా ఉంటూ ముందుకు సాగుతున్నారు.ఇట్టి స్నేహం చిరకాలం ఉండాలని, మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని బాగా చదివించి మంచి ఉన్నత స్థాయిలో ఉండే విధంగా,అందరికీ స్పూర్తిదాయకంగా ఉండే విధంగా చేయాలని ఉపాధ్యాయులు తెలిపారు.అనంతరం ఉపాధ్యాయులు పూర్వ విద్యార్ధులు వారి కుటుంబాలతో కలిసి భోజనాలు చేసి అనంతరం వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. అనంతరం కాల్చలర్ ప్రోగ్రామ్స్ చేసి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమములో బ్యాంక్ మేనేజర్ జగన్,టీచర్ కత్తుల సతీష్,డాక్టర్ సతీష్, టీమ్ లీడర్ గుంపుల శ్రీనివాస్, దేవేందర్,ఏలూరి రాజేష్ కుమార్, వాడపల్లి రమేష్ బాబు,సందీప్,శంకర్,జోగి వెంకటేశ్వర్లు, అన్వర్,హైమద్,ముత్యాల రమేష్,రాజేశ్వరరావు,సాగర్ బాబు,గారే శ్రీనివాస్,కృష్ణ, రఘు,చెవుల బాలకృష్ణ,స్వర్ణ లత,కవిత,మల్లీశ్వరి,బిపాషా తదితరులు పాల్గొన్నారు.

Share this post...