ఉపాధ్యాయుల పదోన్నతులలో అడక్వేసి అనే పదాన్ని తొలగించాలని,ఏజెన్సీ ప్రాంతంలో జీ ఓ. 3 ని అమలుపరిచి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఐఏఎస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. కమిషనర్ మరియు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని మా వంతుగా ప్రభుత్వాన్ని నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్,రాష్ట్ర కోశాధికారి శ్యామ్లాల్, రాష్ట్ర కార్యదర్శి లక్ పతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాపాలాల్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం,జిల్లా నాయకులు బాలాజీ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
