
మాజీ మంత్రివర్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ స్వర్గీయ కోనేరు నాగేశ్వరావు గారి 9 వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో గల కోనేరు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి సీనియర్ లయన్ కోనేరు పూర్ణచందర్రావు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాన్నగారి స్ఫూర్తితో లయన్స్ క్లబ్,కోనేరు ట్రస్ట్ ద్వారా మున్ముందు మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతానని తెలియజేశారు. అనంతరం జ్యోతి అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్, మాజీ అధ్యక్షులు దస్తగిరి, మొరిశెట్టి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
