అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పాత రాయచోటి కి చెందిన మనీషా అనే గర్భిణీ స్త్రీ అమరావతి హాస్పిటల్ నందు డెలివరీ కొరకు చేరగా ఆమెకు A+ రక్తము అత్యవసరమని డాక్టర్స్ పేషంట్ వారికి తెలపగా వారు వెంటనే హీబ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మయాన మహమ్మద్ అలీ పఠాన్ ను సంప్రదించిన వెంటనే ఖలీల్ చేత శ్రీదీప బ్లడ్ బ్యాంకు నందు A+ రక్తదానం చేయించారు.అదేవిధంగా మయాన మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. సాటి మనిషి ప్రాణాలు కాపాడటంలో రక్తదానానికి మించిన దానం లేదు రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడాలని,అదేవిధంగా రక్త కొరత లేని సమాజం నిర్మించాలన్న స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం వలన రక్త కొరత లేని సమాజం నిర్మించవచ్చని పిలుపునిచ్చారు.అత్యవసర సమయంలో స్పందించి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ఖలీల్ కు ఆర్గనైజేషన్ తరపున పేషంట్ వారి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమానత్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు షేక్ పతావుల్లా, ఇనాం, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వెంకటేష్, అమ్ములు పలువురు పాల్గొన్నారు.
