Mon. Feb 2nd, 2026

J365 NEWS: మన రోజువారీ జీవనశైలిలో సౌలభ్యం కోసం జనం అనేక మార్పులు చేసుకుంటున్నారు. కొందరు మంచంపై పడుకొని లేదా సోఫాపై వాలుతూ భోజనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇది నిరపాయం అనిపించినా, వైద్యపరంగా ఇది చాలా ప్రమాదకరం, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైపోవచ్చు. మన శరీరంలో తినే ఆహారం ఎసోఫాగస్ (ఆహార నాళం) లోకి సులభంగా వెళ్ళడానికి సహజంగా కండరాలు, ఆకర్షణ శక్తి (గ్రావిటీ) సహాయపడతాయి. కానీ మనం పడుకొని తింటే ఆ సమన్వయం సరిగా పనిచేయదు. దాంతో ఆహార కణాలు గాలినాళం (ట్రాకియా) లోకి జారి శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవ్వడం లేదా  పైప్ లోకి వెళ్లి ప్రాణాపాయం కలిగించడం జరుగుతుంది.

                           ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అలాగే మింగే సమస్య (డిస్ఫాజియా) ఉన్నవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ. అనేక సందర్భాల్లో ఇంట్లోనే ఊహించని రీతిలో మింగిన ఆహారం గాలినాళంలో ఇరుక్కుపోయి అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.పడుకొని తినడం వల్ల ఆమ్ల రిఫ్లక్స్ (ఆసిడ్ రిఫ్లక్స్), గ్యాస్ట్రిక్ ఇబ్బందులు, జీర్ణకోశ సమస్యలు కూడా వస్తాయి. తిన్న ఆహారం వెనక్కి ఎసోఫాగస్ లోకి చేరి గొంతు వరకు వచ్చి గాలి మార్గాలను కూడా ప్రభావితం చేస్తుంది.అందువల్ల ప్రజలకు అవగాహన అవసరం. ఎప్పుడూ కూర్చుని లేదా నిల్చుని మాత్రమే భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట పాటు సూటిగా కూర్చుని ఉండడం మంచిది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో ఈ అలవాటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న అలవాట్లు, చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. సౌకర్యం కోసం భద్రతను తాకట్టు పెట్టకూడదు. పడుకొని తినడం ఒక నిశ్శబ్ద ముప్పు. దీనిని నివారించడం మన అందరి బాధ్యత.

Share this post...