Mon. Feb 2nd, 2026

J365 NEWS:    వైసీపీ నాయకులకు దమ్ముంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై మాట్లాడాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావ్ అన్నారు. గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటుగా అభివృద్ధి సమాంతరంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకోవాలంటే అది కుదరనిపని అని అన్నారు. వైసీపీ అరాచకాలు నేటికి మరచిపోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని తెలిపారు. నోటి దూలతో అవాకులు చవాకులు పేలుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్న వైసీపీ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలు,అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన దాడుల పై చట్ట పరంగా చర్యలు తీసుకంటే వాటిని తప్పు పడుతూ కూటమి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు, కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం తగదన్నారు

Share this post...