—మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ శాంతియుత ర్యాలీ, సభ కరపత్ర ఆవిష్కరణ
–లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ, సభను జయప్రదం చేయండి డాక్టర్ బానోత్ జగదీశ్వర్ నాయక్….జేఏసీ చైర్మన్.
—గుగులోత్ కిషన్ నాయక్ జేఏసీ వైస్ చైర్మన్, డాక్టర్ వెంకట్ రాములు నాయక్ జేఏసీ ప్రధాన సలహాదారులు.
J365 NEWS: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద బోడ రమేష్ నాయక్ అధ్యక్షతన మానుకోట జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు విద్యార్థి ఉద్యోగ యువజన నిరుద్యోగ రాజకీయ మహిళా వర్తక వ్యాపార కార్మిక కళాకారులు సాదు సంఘాలు కలిసి మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జెఎసి ఆధ్వర్యంలో రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ విగ్రహం ముందు లంబాడీల ఆత్మగౌరవ శాంతియుత ర్యాలీ సభ కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ లంబాడీలు వలసవాదులు కాదు లంబాడీలు మూలవాసులు అని, భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే లంబాడీలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. అప్పటి బ్రిటిష్, నిజాం పాలన కాలంలోనే లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడి ఉన్నారు. లంబాడీల చరిత్ర తెలియని కొంతమంది లంబాడీల వ్యతిరేక శక్తులు వారి వ్యక్తిగత స్వార్థం కోసం, వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగానే లంబాడీలపై దృశప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా అన్నదమ్ములు లాగా కలిసిమెలిసి ఉన్న లంబాడి, ఆదివాసి గిరిజన సోదరుల మధ్యలో చిచ్చుపెట్టి లేని వైరం సృష్టిస్తున్నారని అన్నారు. వారి కుట్రలను తిప్పి కొట్టడానికి లంబాడీల జీవన విధానాని, లంబాడీల చరిత్రను గిరిజన ఆదివాసి సోదరులతో పాటు యావత్ సమాజానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా పోరాటాల గడ్డ అయిన మానుకోటలో ఈనెల 28వ తేదీన వేల మందితో శాంతియుత ర్యాలీ మరియు సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న లంబాడీలు రాజకీయ పార్టీలకు, అతీతంగా వివిధ సంఘాలకు అతీతంగా స్వచ్ఛందంగా కదం తొక్కుతూ తండోపతండాలుగా మానుకోటకు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేసి లంబాడీల ఐక్యతను దేశవ్యాప్తంగా చాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్లు ధరావత్ వెంకన్న నాయక్, బోడ లక్ష్మణ నాయక్ రాజ్ కుమార్ జాదవ్ నాయక్, గుగులోతు భీమా నాయక్, వీరు నాయక్, హాలియా నాయక్, వెంకన్న నాయక్, మోతిలాల్ నాయక్, చక్రు నాయక్, సురేష్ నాయక్, బిచ్చు నాయక్, మోహన్ నాయక్, రవికుమార్ నాయక్, నందులాల్ నాయక్, సిద్దు నాయక్, దాము నాయక్, చందులాల్ నాయక్, రామ్ చందర్ నాయక్, బాలాజీ నాయక్, రాము నాయక్, శ్రీను నాయక్, రాందాస్ నాయక్, హరి నాయక్, మంగీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

