ఫారెస్ట్ వారు పోడు సాగుదారులపై దౌర్జన్యాన్ని, పంటల విధ్వంసాన్ని వెంటనే ఆపాలి,
–సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి.
ఫారెస్ట్ వారు పోడు సాగుదారులపై దౌర్జన్యాన్ని, పంటల విధ్వంసాన్ని వెంటనే ఆపాలని, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మణుగూరు మండలంలోని పోడు భూములను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫారెస్ట్ వారు జిల్లాలో మరియు డివిజన్ లో పోడు సాగుదారులపై దౌర్జన్యం చేస్తూ, పంటలు విధ్వంసం చేస్తున్నారని అన్నారు. మణుగూరు మండలంలోని బుడుగుల,ఇప్పల గుంపు తదితర చోట్ల పంట చేతికి వచ్చే టైం లో పత్తి చేను పీకటం, ట్రెంచులు కొట్టడం దుర్మార్గం అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలి అన్నారు. పాత పోడు భూముల జోలికి ఫారెస్ట్ వారు వెళ్ళ వద్దన్నారు. అదేవిధంగా పోడు సాగుదారులు కూడా కొత్తగా పోడు నరకవద్దన్నారు. ప్రభుత్వాలు కూడా వలస ఆదివాసుల పట్ల వివక్ష చూపుతూ, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు. వారు కూడా దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తూ, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కలిగి, ఓటు హక్కును కూడా కలిగి ఉన్నారు అన్నారు. వారు కూడా ఈ దేశ పౌరులే అన్నారు. వారి ఓట్లు కావాలి కానీ, వారి సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వలస ఆదివాసుల పట్ల వివక్షత విడనాడి వారి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
