Wed. May 6th, 2026

భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ముర్రేడు బ్రిడ్జిపై గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ మండల కార్యదర్శి లావుడ్య పూర్ణ రోడ్డుపై బైఠాయించి ప్రత్యేక నిరసన తెలిపారు.ఏళ్లుగా రహదారిపై ఉన్న గుంతల కారణంగా అనేక మంది ప్రమాదాలకు గురయ్యారని, కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు టాక్స్ కడుతున్న ద్విచక్ర వాహనాలు,కార్లు తరచూ రిపేర్లకు గురవుతున్నాయని,ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.వర్షాకాలంలో రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారిందని పూర్ణ మండిపడ్డారు.పేరుకు జాతీయ రహదారి అంటారు కానీ గుంతలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. రెండు మూడు రోజుల్లో రోడ్డుపై గుంతలను పూడ్చకపోతే నియోజకవర్గ ప్రజల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభిస్తామని హెచ్చరించారు. అవసరమైతే బిచ్చమెత్తినా సరే రోడ్లను మనమే బాగు చేసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.

Share this post...