Mon. Aug 3rd, 2026

మొంథా తుపాను ప్రభావంతో నిన్న రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతు రహదారులు జలమయమయ్యాయి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసర అయితే తప్ప బయటకు రావద్దని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా రవి రాథోడ్ విజ్ఞప్తి చేశారు.అధికారులు,ప్రజలకు అందుబాటులో ఉండాలని ,విద్యుత్తు శాఖ మున్సిపల్ మరియు పారిశుధ్య కార్మికులు అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదేవిదంగా అకాల తుఫాన్ కారణం గా పంటలు నష్ట పోయిన రైతులకు ప్రతి మండలం లో సర్వే జరిపి పంట నష్టం ఇచ్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి రాథోడ్ డిమాండ్ చేశారు.

Share this post...