Sat. Jan 31st, 2026

     ఐటిడిఎ భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, ఐ.ఏ.ఎస్ ఆదేశానుసారం,ప్రతి నెల రెండవ మరియు చివరి శుక్రవారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించి ఉన్నారు.ఈ మేరకు పాల్వంచ బొల్లోరిగూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో కెరియర్ గైడెన్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.లక్ష్మి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మేనేజర్ వెంకట్ రామ్,అసిస్టెంట్ మేనేజర్ శ్వేతా అతిథులుగా హాజరయ్యారు.వక్తలు మాట్లాడుతూ…విద్యార్థినులకు కెరియర్ బిల్డప్, భవిష్యత్ లక్ష్యాల ప్రణాళిక, పదవ తరగతి తర్వాత విద్యా అవకాశాలు,ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ మార్గదర్శకత్వం చేశారు.విద్యార్థినులు తమ చదువులో గోల్‌ను నిర్ణయించుకొని,ముందుగానే ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.అదేవిధంగా పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ కావడానికి ఇప్పటి నుంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ.శ్రీనగేష్, బి.చెన్నారావు, కే.సురేష్,బి.కిషన్, డి.అర్జున్ రావు,ఎం.గంగా, బి.లలిత,కళావతి మరియు పాఠశాల సిబ్బంది విద్యార్దినిలు తదితరులు పాల్గొన్నారు.

Share this post...