Sat. Jan 31st, 2026

         ఇంటి వాకిలిలోకి వచ్చిన తాబేలును ప్రేమతో తిరిగి నీటిలోకి వదిలిన మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని సైన్స్ ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ మానవతా దృష్టికి నిలువుటద్దంగా నిలిచారు. తాబేలును ఎలాంటి హాని జరపకుండా జాగ్రత్తగా ఎత్తుకుని సమీపంలోని కిన్నెరసాని జలాశయంలో వదిలారు.జీవాల పట్ల కరుణా భావంతో..పర్యావరణ సంరక్షణ,జీవరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సతీష్ కుమార్ ఆచరణ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వరూప రాణి, ఎస్.బాలు,శశిగ్ఞత,యం.బాలు,కృష్ణ సుక్య, భాస్కర్ ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this post...