Tue. Feb 3rd, 2026

    సింగరేణి సహకారంతో ఈ నెల 11న భద్రాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజుతో కలిసి జాబ్ మేళా బ్రోచర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ..పదోతరగతి,ఇంటర్,ఐటీఐ,డిప్లొమా,డిగ్రీ, ఇంజినీరింగ్,ఎంబీఏ, పీజీ, ఫార్మసీ వంటి అర్హతలతో 18–40 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు,ఆధార్ కార్డు,పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు మరియు జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.

Share this post...