Thu. Jan 29th, 2026

        ఎస్‌టి జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కుట్రలు, కుతంత్రాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాబురావులను సస్పెండ్ చేయాలని, అలాగే వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ముందు నిరసన ధర్నా, వినతిపత్రం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ అనిల్ నాయక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పిఎస్ పని అధ్యక్షుడు ఇస్లావత్ కుమార్ నాయక్, మండల అధ్యక్షుడు రాంబాబు నాయక్, కార్యదర్శి సురేష్ నాయక్, జిల్లా నాయకులు ఇస్లావత్ కిషోర్ నాయక్, రాములు నాయక్, శేఖరంబంజారా ఎల్‌హెచ్‌పిఎస్ నాయకులు సందీప్ నాయక్, ప్రదీప్ నాయక్,కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...