Thu. Jan 29th, 2026

బుధవారం రోజు కార్తీకమాసం సందర్భంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించబడింది.ఉదయం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు జరిగాయి.అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.సాయంత్రం 7 గంటలకు జ్వాలతోరణ కార్యక్రమం భక్తి ఉత్సాహాలతో సాగింది.భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సజావుగా నిర్వహించామని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్ రజనీ తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

Share this post...