Fri. Jan 30th, 2026

పాల్వంచ:ఐటిడిఎ భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఐఏఎస్‌ ఆదేశాల మేరకు భద్రాచలం ఐటిడిఏ పరిధిలో జోనల్ స్థాయి లీగ్ పోటీలు మరియు ఎంపికల గిరిజన క్రీడలు నవంబర్ 18, 19 తేదీలలో ప్రభుత్వ ఆదర్శ క్రీడా పాఠశాల,కిన్నెరసానిలో నిర్వహించనున్నారు.నవంబర్ 18న బాలికలు,19న బాలురు పాల్గొననున్నారు.ఈ నేపథ్యంలో సిద్ధం చేసిన క్రీడా మైదానాలను ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా క్రీడా అధికారి బి.గోపాల్ రావు,ఏటీడీవో చంద్రమోహన్ పరిశీలించారు. వాలీబాల్,కబడ్డీ,ఖో-ఖో, టెన్నికోయిట్,విలువిద్య, అథ్లెటిక్స్,400 మీటర్ల పరుగుపందెం, చేస్‌,క్యారమ్‌ తదితర క్రీడల మైదానాలు పూర్తిగా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.జోనల్ స్థాయిలో ఎంపికైన క్రీడాకారు లు డిసెంబర్ 3, 4, 5 తేదీలలో వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఐటిడిఏ పరిధిలో జరిగే రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడల్లో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి బొల్లి గోపాల్ రావు,ఏటీడీవో చంద్రమోహన్,ఎ.ఎస్.ఓలు కొమరం వెంకట నారాయణ, సోయం నాగేశ్వరరావు, బండ రాంబాబు,ఇంచార్జీ హెచ్ ఎం బి.శంకర్,వార్డెన్ పోలేబోయిన వెంకటేశ్వర్లు పి.డి లు, ఎస్.బాలసుబ్రమణ్యం,ఎ.శ్రీనగేష్ పి.రాంబాబు,ఐ.గోపాలరావు, బి.మోతిలాల్, బి.హరికృష్ణ, వి.ముత్తయ్య, వీరభద్రం అలాగే కోచ్‌లు వాసు,ప్రసాద్,స్థానిక పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this post...