Sat. Jan 31st, 2026

మంచిర్యాల:విజయ్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ వి.వి.విజయ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో చలికి, ఆహారానికి ఇబ్బంది పడేవారికి దుప్పట్లు,ఆహార పదార్థాలు అందించి దాతృత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇలానే అనాథలకు, వికలాంగులకి ఇలాంటి వారికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది.ఇది ఇలానే మునుముందు రోజులలో విజయ్ బ్లడ్ బ్యాంక్ టీమ్ సభ్యులు ద్వారా ఇంకా ఎక్కువ మందికి సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది.ఈ సేవా కార్యక్రమాలు విజయవంతంగా జరిగినందుకు విజయ్ బ్లడ్ బ్యాంక్ టీమ్ సభ్యులకు ఫౌండర్ విజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ విజయ్ మరియు టీం సభ్యులు సందీప్,మహేష్, సంజీవ్,సురేందర్,కిరణ్, నాగరాజు,శంకర్,ప్రవీణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Share this post...