బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 14 నుండి 20 వరకు మహిళా, శిశు,దివ్యాంగులు,వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వారంతపు సంబరాలు గురువారం ముగిశాయి.ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఐఏఎస్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
పర్యావరణ పరిరక్షణకు వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజూ మొక్కలు నాటుతూ విశేష సేవలు అందిస్తున్న చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ ను కలెక్టర్ అభినందించారు.ఆయన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం తో పాటు మేమెంటోను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారిని ఆశీస్సులతో అభినందిస్తూ, భవిష్యత్తులో పచ్చదనం కోసం మరింత కృషి చేయాలని సూచించారు. ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న కలెక్టర్‌కు విశ్వామిత్ర చౌహాన్ మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యాచందన,జిల్లా డీఈవో నాగలక్ష్మి,జిల్లా డిడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా,షీ టీమ్ ఇన్స్పెక్టర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
